EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

పదిహేనేళ్ల భూమి సమస్యకు పరిష్కారం

📰 Generate e-Paper Clip

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే06:

 

 

కుప్పం మండలం దేవరాజపురం గ్రామపంచాయతీ పరిధిలోని కంగుంది ఆర్ ఎఫ్ రెవెన్యూ గ్రామంలో గత పదిహేనేళ్లుగా కొనసాగుతున్న భూమి సమస్యకు పరిష్కారం లభించింది. తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆధ్వర్యంలో ఈ సమస్యను పరిష్కరించారు. ఈ సమస్య పరిష్కారానికి క్లస్టర్ ఇంచార్జ్ కన్నన్, కంగుంది మాజీ సర్పంచ్ లోకనాధ్, ధనశేఖర్, శాంతిపురం కందస్వామి చొరవ తీసుకుని సంబంధిత వర్గాలతో చర్చలు జరిపి సమస్యను సవ్యంగా పరిష్కరించారు. దీంతో గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తూ సమస్య పరిష్కారానికి కృషి చేసిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. దీర్ఘకాలంగా ఉన్న సమస్యకు పరిష్కారం లభించడం గ్రామంలో ఆనందాన్ని కలిగించింది.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!