
కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే05:
కుప్పం పట్టణంలో ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా స్థానిక చిత్రకారుడు పురుషోత్తం వినూత్న కళాఖండంతో ఆకట్టుకున్నాడు. పూరి ఆర్ట్స్ పేరుతో గుర్తింపు పొందిన ఈ కళాకారుడు కొబ్బరి చిప్ప లోపల గంగమ్మ అమ్మవారి విశ్వరూపాన్ని అద్భుతంగా చిత్రీకరించాడు. ప్రతి సంవత్సరం జాతర సందర్భంగా కొత్తదనంతో అమ్మవారి చిత్రాలను రూపొందిస్తూ వస్తున్న పురుషోత్తం, ఈసారి కొబ్బరి చిప్పను వినియోగించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. చిన్న స్థలంలోనూ సూక్ష్మంగా వివరాలు ప్రతిబింబించేలా రూపొందించిన ఈ చిత్రం భక్తులను, కళాభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా పురుషోత్తం మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అమ్మవారి జాతరలో చిత్రం వేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపాడు. తన కళ ద్వారా అమ్మవారికి సేవ చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. ఈ వినూత్న కళాఖండానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రాచుర్యం పొందుతూ పలువురి ప్రశంసలు అందుకుంటోంది.


Recent Comments