EPAPER
Friday, September 4, 2026
Google search engine

నేపాల్ వరదల్లో కుప్పం యువకుడు.. ఆచూకీ కోసం కుటుంబ సభ్యుల వేడుకోలు

📰 Generate e-Paper Clip

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఆగస్టు 27:

 

టూర్ కోసం నేపాల్‌కు వెళ్లిన కుప్పంకు చెందిన బాలసుబ్రమణ్యం అక్కడ సంభవించిన వరదల్లో చిక్కుకున్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఈ విషయాన్ని ప్రముఖ న్యాయవాది, బాలసుబ్రమణ్యం సోదరుడు శ్రీకాంత్ తెలిపారు. మంగళవారం చివరిసారిగా తమతో ఫోన్‌లో మాట్లాడిన బాలసుబ్రమణ్యం అనంతరం అందుబాటులోకి రాలేదని పేర్కొన్నారు. ట్రావెల్ ఏజెన్సీ ద్వారా బాలసుబ్రమణ్యం వరదల్లో చిక్కుకున్నట్లు తెలిసిందన్నారు. ఆయన ఆచూకీ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యాలయాన్ని సంప్రదించి సహాయం కోరినట్లు శ్రీకాంత్ తెలిపారు. బాలసుబ్రమణ్యం ఆచూకీని వెంటనే గుర్తించి, సురక్షితంగా కుప్పంకు తీసుకురావాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్నికోరుతున్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!