
శాంతిపురం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 07:
కుప్పంనియోజకవర్గం శాంతిపురం మండలం కెనమాకులపల్లి పంచాయతీ పరిధిలోని కెనమాకులపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. గురువారం ఏప్రిల్ 9న సాయంత్రం 4 గంటలకు ఈ పోటీలు ప్రారంభమవుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలలో విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు ఏర్పాటు చేశారు. మొదటి బహుమతిగా 30116, రెండవ బహుమతిగా 20116, మూడవ బహుమతిగా 15116, నాలుగవ బహుమతిగా 10116, ఐదవ బహుమతిగా 7116, ఆరవ బహుమతిగా 5116, ఏడవ బహుమతిగా 4116, ఎనిమిదవ బహుమతిగా 3516, తొమ్మిదవ బహుమతిగా 3116, పదవ బహుమతిగా 2516, పదకొండవ బహుమతిగా 2116 రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అదనంగా ఉత్తమ దాడిదారు, ఉత్తమ రక్షకుడికి ప్రత్యేక బహుమతులు కూడా అందజేయనున్నారు. ఈ పోటీల్లో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న కబడ్డీ క్రీడాకారులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కెనమాకులపల్లి, గడ్డూరు గ్రామస్థులు కోరుతున్నారు.


Recent Comments