
కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 22:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు డ్రగ్స్ రహిత ఆంధ్ర ప్రదేశ్ కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయవలసిన అవసరం ఉందని కుప్పం డి.ఎస్.పి పార్థసారథి అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కుప్పం నందు ఎన్ఎస్ఎస్ మరియు వైబ్రoట్స్ ఆఫ్ కలాం ఫౌండేషన్ కుప్పం నియోజకవర్గ కోఆర్డినేటర్ ఎం శివాజీ ఆధ్వర్యంలో డ్రగ్స్ రహిత ఆంధ్ర ప్రదేశ్ అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిఎస్పి పార్థసారథి మాట్లాడుతూ.. యువత మాదకద్రవ్యాలకు బానిసలైతే ఉజ్వలమైన భవిష్యత్తు దూరమవుతుందని అన్నారు. వైబ్రoట్స్ ఆఫ్ కలాం ఫౌండేషన్ వ్యవస్థాపకులైన విజయ్ కలాం 1000 కిలోమీటర్ల సైకిల్ యాత్ర ముగింపు సందర్భంగా 100 మీటర్ల జాతీయ జెండాను ఊరేగించారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్, గుడిపల్లి ఎస్సై శ్రీకాంత్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రదీప్ కుమార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ వి నారాయణమూర్తి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ చైర్మన్ శివాజీ, కుప్పం ప్రజాసేవ ఫౌండేషన్ చైర్మన్ కార్యదర్శి కె శరవణ, నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నియోజకవర్గం వైస్ చైర్మన్ దేవా, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సి రాజ్యలక్ష్మి, తదితర అధ్యాపకులు మరియు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


Recent Comments