
చిత్తూరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూన్ 29:
చిత్తూరు జిల్లా నాన్-కేడర్ ఎస్పీ (అడ్మినిస్ట్రేషన్)గా ఎస్.ఆర్. రాజశేఖర్ రాజు సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అడిషనల్ ఎస్పీలకు నాన్-కేడర్ ఎస్పీ హోదాలో పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా, ఆ పదోన్నతిలో భాగంగా ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు నాన్-కేడర్ ఎస్పీ (ఆపరేషన్స్)గా విధులు నిర్వహించిన ఎస్.ఆర్. రాజశేఖర్ రాజు, చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో నూతన బాధ్యతలను చేపట్టారు.పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఐపీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు శాఖ పరిపాలనా వ్యవహారాలపై చర్చించినట్లు తెలిసింది. నూతన బాధ్యతలు చేపట్టిన ఎస్.ఆర్. రాజశేఖర్ రాజుకు జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.


Recent Comments