EPAPER
Saturday, April 18, 2026
Google search engine

ఘనంగా పోషణ పక్వాడా కార్యక్రమం

📰 Generate e-Paper Clip

శ్రీకాళహస్తి,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 10:

 

శ్రీకాళహస్తి శ్రీకాళహస్తిలోని మునిసిపల్ పరిధిలో ఉన్న ఓటేరు కాలువ అంగన్వాడి కేంద్రంలో 8 రాష్ట్రీయ పోషణ మాసం కార్యక్రమం అంగన్వాడీ సూపర్వైజర్‌ భాగ్యలక్ష్మి టాటా సంస్థ ఉద్యోగి లక్ష్మీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ గర్భవతులు, బాలింతలు తీసుకోవలసిన జాగ్రత్తలు,స్థూలకాయ నివారణ, చక్కెర,నూనె వినియోగం గురించి అవగాహన కల్పించారు. అదేవిధంగా పౌష్టిక ఆహారం పై సలహాలు,సూచనలు ఇవ్వడం జరిగినది. గర్భిణి స్త్రీలు,బాలింత తల్లులకు పోషక ఆహార విలువలను,మహిళా సాధికారత యొక్క ముఖ్య ఉద్దేశాలను అలాగే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ఈ రోజుల్లో మహిళలు అనేక రంగాల్లో ముందున్నప్పటికీ గాను ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని వాటిని అధిగమించి ముందుకు వెళ్లే దిశగా ఉండాలని అన్నారు. బాల్య వివాహాలను అరికట్టాలని, సఖి,అంగన్వాడి కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించడం జరిగింది. అలాగే టోల్ ఫ్రీ నెంబర్స్ 181,1098, 155209, 14567, 112, 14416, 1930 మొదలగు నంబర్లను అందరూ వినియోగించుకోవాలని కోరారు.పరిశుభ్రత,ఆరోగ్య పోషక విలువలు,గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తగు చర్యలగురించి సూచించాముని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు,ఆయా అమ్మలు,స్థానిక మహిళలు, గర్భిణీలు,బాలింత తల్లులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!