EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

క్రమశిక్షణతో చదువుకుంటే విద్యార్థి జీవితం కొత్త బంగారులోకం…  కరస్పాండెంట్ మనోరంజని 

📰 Generate e-Paper Clip

ఎస్ఆర్ పురం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 18:

 

విద్యార్థి క్రమశిక్షణతో చదువుకుంటే వారి జీవితంలో కొత్త బంగారులోకంలా ఉంటుందని ఇండో జర్మనీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ మనోరంజని తెలిపారు శనివారం ఎస్ఆర్ పురం మండలం నెలవాయి వద్ద ఉన్న ఇండో జర్మనీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో పాఠశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ మనోరంజని మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో కార్పొరేట్ స్థాయిలో ఇండో జర్మన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు అలాగే ప్రతి విద్యార్థి చిన్న వయసు నుంచే క్రమశిక్షణతో సేవాభావంతో మెలగాలని విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం పాఠశాల వార్షికోత్సవ సందర్భంగా విద్యార్థులకు ఆట పోటీలు క్విజ్ పోటీలు డాన్స్ కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గౌరీ జమున ,రాహుల్ మోహన్ శ్రీనివాసులు లావణ్య, మాదవి, లావణ్య, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!