
శాంతిపురం, చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూలై 17:
చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలోని కెనమాకులపల్లి గ్రామంలో వెలసిన శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఆషాఢ మాస ప్రారంభోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు భజన భక్తి బృందం తెలిపింది. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి పుష్ప పల్లకి సేవ, బాణవేడుకలు, అన్నదాన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కెనమాకులపల్లి గ్రామ భజన భక్తి బృందం, గ్రామస్తులు సంయుక్తంగా భక్తులకు ఆహ్వానం పలుకుతూ, పరిసర ప్రాంతాలతో పాటు నలుమూలల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివారిని దర్శించుకుని ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగే ఈ ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు.


Recent Comments