
కుప్పం,చిత్తూరు ఎక్స్ప్రెస్,అక్టోబర్ 01:
కుప్పం టౌన్ బ్యాంక్ నూతన చైర్మన్గా మంజు నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో మంజుకు చైర్మన్ బాధ్యతలు అప్పగించగా, వైస్ చైర్మన్గా ఉదయ్ కుమార్, డైరెక్టర్లుగా సింధు, చాంద్ భాషా, నవనీత నియమితులయ్యారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గానికి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పీఎస్ మునిరత్నం, సీఎం పీఏ శ్రీకాంత్, పీకేఎం-ఉడా చైర్మన్ డాక్టర్ బి.ఆర్. సురేష్ బాబు, సీఎం పీఏ శ్రీకాంత్ కు కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. టౌన్ బ్యాంక్ ద్వారా ఖాతాదారులకు, స్థానిక ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడంతో పాటు బ్యాంక్ అభివృద్ధికి నూతన పాలకవర్గం సమష్టిగా కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు. బ్యాంక్ కార్యకలాపాలను మరింత విస్తరించి, ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా సేవలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ మంజు, వైస్ చైర్మన్ ఉదయ్ కుమార్, డైరెక్టర్లు సింధు, చాంద్ భాషా, నవనీతలను పలువురు నాయకులు అభినందించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ టౌన్ బ్యాంక్ అభివృద్ధికి కృషి చేస్తామని నూతన పాలకవర్గ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ వి.జి. ప్రతాప్ కుమార్, మున్సిపల్ టీడీపీ అధ్యక్షుడు కాణిపాకం మెంటేష్, మాజీ ఏఎంసీ చైర్మన్ సతేంద్ర శేఖర్, కౌన్సిలర్ జిమ్ దాము, జాకీర్ అహ్మద్, సోమశేఖర్ , 11వ క్లస్టర్ ఇంచార్జ్ కన్నన్, ఆర్ ఆర్ రవి, గాజుల గోపీనాథ్, యూనిట్ ఇంచార్జ్ అప్పు (ముఖేష్) జనసేన నియోజకవర్గం ఇంచార్జ్ నరేష్, బిజెపి నియోజకవర్గం ఇన్చార్జి తులసి నాథ్, కూటమి ప్రభుత్వ నాయకులు, స్థానిక కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



Recent Comments