EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

ఎస్‌ఐఆర్–2026లో చిత్తూరు జిల్లా కీలక మైలురాయి ఓటర్ల డిజిటైజేషన్, ఏఎస్‌డీ, డీఎస్‌ఈ పరిశీలన తుది దశకు – కేవలం ఐదు కేసులే పెండింగ్: కలెక్టర్ సుమిత్ కుమార్

📰 Generate e-Paper Clip

చిత్తూరు, చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూలై 24:

 

ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం (ఎస్‌ఐఆర్–2026)లో చిత్తూరు జిల్లా మరో కీలక మైలురాయిని చేరుకుందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ తెలిపారు. ఓటర్ల వివరాల డిజిటైజేషన్, మ్యాపింగ్, ఏఎస్‌డీ (Absent, Shifted, Dead), డీఎస్‌ఈ (Demographic Similar Entries) పరిశీలన ప్రక్రియలు తుది దశకు చేరుకున్నాయని, ప్రస్తుతం మొత్తం ఐదు కేసులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. జిల్లాలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో మొత్తం 13,40,126 మంది ఓటర్లు ఉండగా, వారిలో 12,04,503 మంది ఓటర్ల వివరాలను డిజిటైజ్ చేసినట్లు తెలిపారు. రోల్‌బ్యాక్‌కు సంబంధించిన 31 దరఖాస్తులు, ఆన్‌లైన్ ద్వారా వచ్చిన మూడు దరఖాస్తులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లాలో 29,900 మంది (2.23 శాతం) ఓటర్లకు మ్యాపింగ్ పూర్తి కాలేదని, 1,35,623 మంది (10.12 శాతం) ఓటర్లను అన్-కలెక్టబుల్‌గా గుర్తించినట్లు తెలిపారు. మొత్తం 1,35,703 అనోమలీస్ నమోదైనట్లు వెల్లడించారు. ఏఎస్‌డీ డిస్క్రిపెన్సీల పరిశీలనలో మొత్తం 25,110 కేసుల్లో, 5,381 కేసులకు ఎలాంటి చర్య అవసరం లేదని ధృవీకరించగా, 19,726 కేసులను అన్-కలెక్టబుల్‌గా గుర్తించినట్లు తెలిపారు. ప్రస్తుతం నగరి నియోజకవర్గంలో రెండు, పలమనేరు నియోజకవర్గంలో ఒకటి చొప్పున మూడు కేసులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. డీఎస్‌ఈ పరిశీలనలో మొత్తం 4,509 కేసుల్లో, 4,041 కేసులను ధృవీకరించి, 466 కేసులను అన్-కలెక్టబుల్‌గా గుర్తించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం చిత్తూరు, కుప్పం నియోజకవర్గాల్లో ఒక్కో కేసు చొప్పున రెండు కేసులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. నియోజకవర్గాల వారీగా డిజిటైజేషన్ ప్రక్రియ సంతృప్తికరంగా కొనసాగుతోందని పేర్కొన్న కలెక్టర్, మిగిలిన పనులను కూడా వేగంగా పూర్తి చేసి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోందన్నారు. ఓటర్ల జాబితా పరిశుభ్రత, పారదర్శకతను నిర్ధారించేందుకు ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, మిగిలిన కొద్ది కేసులను కూడా త్వరలోనే పరిష్కరించి ఎస్‌ఐఆర్–2026 ప్రక్రియను పూర్తిచేస్తామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ తెలిపారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!