
పలమనేరు,చిత్తూరు ఎక్స్ప్రెస్, ఆగస్టు 22:
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలానికి చెందిన మైనార్టీ సోదరులు పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డిని శనివారం పలమనేరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గంగవరం మండలం డ్రైవర్స్ కాలనీలో మైనార్టీ సోదరులు నిర్మించుకున్న మహమ్మదీయ మసీదుకు పొజిషన్ సర్టిఫికెట్ మంజూరు చేయించడంలో ఎమ్మెల్యే చేసిన కృషికి వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమరనాథ రెడ్డిని మైనార్టీ ప్రతినిధులు సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా పొజిషన్ సర్టిఫికెట్ను స్వీకరించి, సమస్య పరిష్కారానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. మైనార్టీల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే చొరవ చూపడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ అధ్యక్షుడు ఖాజాపీర్,ముతవల్లి జమాల్ బాషా,పటేల్ ఎం.డి. మొహమ్మద్, సర్కార్ భాష, అమర్, చాంద్ భాషా, సిరాజ్, గుడుసాబ్ తదితరులు పాల్గొన్నారు.


Recent Comments