
వెదురుకుప్పం,చిత్తూరు ఎక్స్ప్రెస్, జూలై 31:
గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం ఇనాంకొత్తూరు గ్రామంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం. థామస్ ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు గురుసాల కిషన్ చంద్ ఆధ్వర్యంలో ‘రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి, సంక్షేమం’ ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు పుల్లూరు సుధాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు సువ్వాల మునిరాజా రెడ్డి, అరగొండ మురళీమోహన్ రెడ్డి, బోడిరెడ్డి మోహన్ రెడ్డి, మల్లికార్జున్ యాదవ్, గురునాథం యాదవ్, శేఖర్, మురళి, నవీన్, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Recent Comments