EPAPER
Wednesday, October 21, 2026
Google search engine

మిల్కీమిస్ట్ డెయిరీలో ఘనంగా దసరా సంబరాలు పాడి రైతుల సంక్షేమమే లక్ష్యం.. అభివృద్ధికి అండగా ఉంటాం

📰 Generate e-Paper Clip

రామకుప్పం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్‌,అక్టోబర్ 20:

 

కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం విజిలాపురం గ్రామంలో మిల్కీమిస్ట్ డెయిరీ ఆధ్వర్యంలో దసరా సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డెయిరీ ప్రతినిధులు పాడి రైతులకు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి సంక్షేమం, అభివృద్ధికి సంస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. తమిళనాడు నుంచి కుప్పం నియోజకవర్గానికి విస్తరించిన మిల్కీమిస్ట్ డెయిరీ, పాడి రైతులతో సత్సంబంధాలను కొనసాగిస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తోందని ప్రతినిధులు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పాడి పరిశ్రమ అనేక కుటుంబాలకు జీవనాధారంగా నిలుస్తోందని, పశుపోషణ ద్వారా రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సహకారం అందించడం ముఖ్యమని అన్నారు. రైతుల కష్టాన్ని గుర్తిస్తూ, వారి సంక్షేమానికి నిరంతరం తోడ్పాటు అందిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సబ్జాన్, బాలకృష్ణ, మురుగేష్‌తో పాటు డెయిరీ క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు. పండుగ వాతావరణంలో నిర్వహించిన ఈ వేడుకలు పాడి రైతులకు, డెయిరీ సంస్థకు మధ్య ఉన్న అనుబంధాన్ని చాటి చెప్పాయి.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!