శ్రీకాళహస్తి, చిత్తూరు ఎక్స్ప్రెస్, అక్టోబర్ 17
శ్రీకాళహస్తి స్థానిక ఎన్నికల్లో జనసేన పార్టీకి 40 శాతం ప్రాతినిధ్య కోటా కేటాయించాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలోని నగిరి వీధి సదాశివ టవర్స్లో స్థానిక ఎన్నికల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో తిరుపతి పార్లమెంట్ జనసేన సమన్వయకర్త మిద్దెల హరి, అసెంబ్లీ సమన్వయకర్తలు కొట్టే సాయి ప్రసాద్, సత్రవాడ ప్రవీణ్, దండి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కూటమి నాయకులైన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ కుమార్ తో చర్చించి, జనసేనకు రావాల్సిన కోటాపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కూటమి పార్టీల మధ్య సమన్వయంతో పనిచేసి స్థానిక ఎన్నికల్లో జనసేన విజయానికి కృషి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ప్రాంత నాయకులు దావాలగిరి, గంజి వెంకటేష్, హరి, బాలిశెట్టి నరసింహులు, పోలి గణేష్, లీలా మోహన్, వేణుగోపాల్, మునిశేఖర్, పోలా సాయి, ప్రసాద్, చెర్లోపల్లి అజయ్, నవీన్, పసల గురవయ్య తొట్టంబేడు నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవితో పాటు శ్రీకాళహస్తి మండల నాయకులు బి. వెంకటరత్నం, అజయ్ కుమార్, వరదరాజులు, గంధం ఢిల్లీ కుమార్, రేణిగుంట మండల నిర్వాహక సభ్యులు ఆకుల భాగ్యలక్ష్మి, మహబూబ్ బాషా, తిలక్, త్యాగరాజులు, సుజాత తదితరులు పాల్గొన్నారు.




Recent Comments