
ఎస్ఆర్పురం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, అక్టోబర్ 06:
గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో సుమారు రూ.300 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ థామస్ తెలిపారు. మంగళవారం ఎస్ఆర్పురం మండలం శెట్టివానత్తం గ్రామంలో నిర్వహించిన పల్లె పండుగ–3 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.11 లక్షలతో సీసీ రోడ్లు, రూ.5 లక్షలతో డ్రైనేజీ, సుమారు రూ.30 లక్షలతో సచివాలయం నుంచి శెట్టివానత్తం వరకు సిమెంట్ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. రూ.25 లక్షలతో నిర్మించిన విలేజ్ క్లినిక్ను ప్రారంభించారు. పల్లె పండుగ–1లో రూ.2.5 కోట్లు, పల్లె పండుగ–2లో రూ.6 కోట్లు, పల్లె పండుగ–3లో రూ.2 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు సుమారు రూ.8 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ను అందించినట్లు పేర్కొన్నారు. తన సతీమణి శాంతిరెడ్డి స్థానిక కుటుంబానికి చెందిన వారని, తాను ఈ ప్రాంత ప్రజలకు ఇంటి అల్లుడినని పేర్కొంటూ తనను ఆదరించాలని ఎమ్మెల్యే థామస్ కోరారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు షణ్ముగం రెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చిట్టిబాబు నాయుడు, మండల అధ్యక్షుడు గంధమనేని జయశంకర్ నాయుడు, జనసేన ఇన్చార్జి యుగంధర్, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Recent Comments