EPAPER
Sunday, October 18, 2026
Google search engine

ప్రలోభాలకు లొంగొద్దు.. చదువుతోనే భవిష్యత్తు యువత ఉజ్వల భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం భరోసా ‘యువత భవితకు భరోసా’ కార్యక్రమంలో ఎంపీ దగ్గుమళ్ల, ఎమ్మెల్యే జగన్‌మోహన్

📰 Generate e-Paper Clip

 

చిత్తూరు, చిత్తూరు ఎక్స్ ప్రెస్, సెప్టెంబర్ 28:

 

విద్యార్థులు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఉన్నత విద్యపై దృష్టి సారించి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువత భవిష్యత్తుకు భరోసా కల్పించేలా పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘యువత భవితకు భరోసా’ కార్యక్రమాన్ని సోమవారం చిత్తూరులోని అపోలో యూనివర్సిటీలో నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ… విద్యార్థుల్లో భవిష్యత్తుపై నమ్మకం పెంపొందించడం, ప్రభుత్వ పథకాలు, అవకాశాలపై అవగాహన కల్పించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. యువతకు ఉపాధి అవకాశాలను పెంచేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. యువత తమ సామర్థ్యాలను పెంపొందించుకుని భవిష్యత్తును స్వయంగా తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే జగన్‌మోహన్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రభుత్వ పథకాల ద్వారా లభిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు. పరిశ్రమలతో పాటు విద్యాసంస్థలు కూడా ప్రాంతీయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. అపోలో యూనివర్సిటీ ఏర్పాటుతో మురకంబట్టు ప్రాంతం అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందిస్తున్న అపోలో యూనివర్సిటీ భవిష్యత్తులో డీమ్డ్ యూనివర్సిటీగా ఎదగడానికి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో అపోలో యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ డా. నితిన్‌ ఎం. నాగార్కర్‌, ప్రో వైస్‌ ఛాన్సలర్‌ (అకాడెమిక్స్‌) డా. అల్ఫ్రెడ్‌ జే. ఆగస్టిన్‌, రిజిస్ట్రార్‌ అనిల్‌కుమార్‌ ఎస్‌, ఏఐఎంఎస్‌ఆర్‌ డీన్‌ డా. రామ్య రామకృష్ణన్‌, యూనిట్‌ హెడ్‌ ఎస్‌. బాలరాజ్‌, రాజకీయ ప్రముఖులు, వివిధ విభాగాల డీన్లు, ప్రిన్సిపల్స్‌, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!