EPAPER
Sunday, October 18, 2026
Google search engine

శ్రీకాళహస్తిలో మెగా కార్డన్ సెర్చ్

📰 Generate e-Paper Clip

తొట్టంబేడు, చిత్తూరు ఎక్స్ప్రెస్: తొట్టంబేడు మండలం తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ ఏ. శ్రీనివాసులు ఆధ్వర్యంలో, శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి పర్యవేక్షణలో రాజీవ్‌నగర్ కాలనీలో శనివారం మెగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పోలీసులు కాలనీలో విస్తృతంగా తనిఖీలు చేపట్టి 78 ద్విచక్ర వాహనాలు, 12 ఆటోలు కలిపి మొత్తం 90 వాహనాలను తనిఖీ చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు. ఆపరేషన్ ‘త్రిశూల్’లో భాగంగా ప్రజలకు డ్రగ్స్ నిర్మూలన, మహిళలు–బాలికల భద్రత, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, అనుమానాస్పద కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  అదనపు ఎస్పీ (అడ్మిన్)శ్రీ ఏ. శ్రీనివాసులు, శ్రీకాళహస్తి డీఎస్పీశ్రీ నరసింహమూర్తి , వన్ టౌన్ సిఐ సి.వెంకటేష్, టూ టౌన్ సీఐ నాగరాజు, రూరల్ సీఐ ఎస్.కె. ఇబ్రహీం,టూ టౌన్ ఎస్సై వై జ్యోతి, రేణిగుంట పోలీస్ స్టేషన్‌ల సీఐలు, సీఐ జయచంద్ర, ఆర్‌ఐ నాగభూషణం, ఆర్‌ఐ రమణారెడ్డితో పాటు పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!