EPAPER
Sunday, October 18, 2026
Google search engine

స్థానిక ఎన్నికలే లక్ష్యం.. గ్రామస్థాయిలో టీడీపీ సమన్వయం పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలి: పీఎస్‌ మునిరత్నం

📰 Generate e-Paper Clip

కుప్పం, చిత్తూరు ఎక్స్ ప్రెస్, సెప్టెంబర్ 17:

 

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టీడీపీ శ్రేణులు గ్రామస్థాయి నుంచి సమష్టిగా పనిచేయాలని ఏపీఎస్‌ఆర్టీసీ ఉపాధ్యక్షుడు పీఎస్‌ మునిరత్నం పిలుపునిచ్చారు. మండల టీడీపీ అధ్యక్షుడు రాజగోపాల్ ఆధ్వర్యంలో శుక్రవారం మోట్లచేను గ్రామంలో నిర్వహించిన పార్టీ సమీక్ష సమావేశానికి మునిరత్నంతో పాటు ఏపీఐఐసీ రాష్ట్ర డైరెక్టర్ ప్రేమ్‌కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలుత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గ్రామంలో పార్టీ పరిస్థితిపై సమీక్ష నిర్వహించి, స్థానిక ఎన్నికలకు అనుసరించాల్సిన కార్యాచరణపై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామం, వార్డులో పార్టీ శ్రేణులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని మునిరత్నం కోరారు. సమావేశంలో కూటమి నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!