EPAPER
Sunday, October 18, 2026
Google search engine

పారదర్శకంగా డీఎస్సీ నిర్వహిస్తే అసత్య ఆరోపణలా? వైసీపీ తప్పుడు ప్రచారాలను మానుకోవాలి మాజీ ఎమ్మెల్సీ గౌని వారి శ్రీనివాసులు

📰 Generate e-Paper Clip

శాంతిపురం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్, సెప్టెంబర్ 14:

 

కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మెగా డీఎస్సీ నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసత్య ఆరోపణలు చేయడం తగదని మాజీ శాసనమండలి సభ్యులు, మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు గౌని వారి శ్రీనివాసులు అన్నారు. ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత దశాబ్దాల కలను సాకారం చేస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మెగా డీఎస్సీ నియామక ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీ మేరకు రికార్డు స్థాయిలో 16 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి వేలాది నిరుద్యోగ కుటుంబాల్లో వెలుగులు నింపారని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా కేవలం ప్రతిభ ఆధారంగానే నియామకాలు చేపట్టారని అన్నారు. డీఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులే తిప్పికొడుతున్నారని శ్రీనివాసులు అన్నారు. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా, ఒక్క రూపాయి లంచం లేకుండా ఉద్యోగాలు పొందామని వారు స్పష్టం చేస్తున్నారని తెలిపారు. తప్పుడు ఆరోపణలు, అసత్య ప్రచారాలను ఇప్పటికైనా వైసీపీ నాయకులు మానుకోవాలని హితవు పలికారు. లేనిపక్షంలో ప్రజలు తగిన గుణపాఠం చెప్పే సమయం దగ్గరలోనే ఉందని హెచ్చరించారు.

 

జలధారతోనే స్వర్ణాంధ్రకు పునాది

 

రాష్ట్ర భవిష్యత్తు నీటి భద్రతపైనే ఆధారపడి ఉందన్న దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘జలధార–జలహారతి’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారని శ్రీనివాసులు తెలిపారు. నీటి సంరక్షణను ప్రజా ఉద్యమంగా మలచాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ప్రతి చెరువును నింపడం, కాలువల్లో పూడికతీత, మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల పునరుద్ధరణకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా భూగర్భ జలమట్టాలు పెరిగి వ్యవసాయం లాభసాటిగా మారుతుందని చెప్పారు. తద్వారా విద్యుత్ వినియోగం తగ్గడంతో పాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని వివరించారు. సాగునీటి సంఘాలు, స్థానిక ప్రజలను భాగస్వాములను చేసి ‘స్వర్ణాంధ్ర’ లక్ష్యాలను సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని శ్రీనివాసులు పేర్కొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!