EPAPER
Sunday, October 18, 2026
Google search engine

మాట ఇచ్చాం.. అభివృద్ధి చేసి చూపాం రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమం:  ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి

📰 Generate e-Paper Clip

పలమనేరు,చిత్తూరు ఎక్స్‌ప్రెస్, సెప్టెంబరు 12:

 

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చి అభివృద్ధి చేసి చూపామని పలమనేరు ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి అన్నారు. శనివారం చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావుతో కలిసి పలమనేరు పట్టణంలోని గొబ్బిళ్లకోటూరు, టెర్రకోట కాలనీ, గంటావూరు ఇందిరమ్మ, వైఎస్సార్, బీసీ కాలనీల్లో ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు రూ.9 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టారు. గంటావూరులో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓట్లు వేసినవారు, వేయనివారు అనే తేడా లేకుండా రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, తాగునీరు వంటి మౌలిక వసతులకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. ఆర్డీఎస్‌ఎస్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమైన ‘ఇంటికో పారిశ్రామికవేత్త’ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాలకు 24 గంటల త్రీఫేజ్ విద్యుత్ అందిస్తున్నామని, కుటీర పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు. అనంతరం ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేశారు. మట్టి వినాయకులనే పూజిద్దాం: వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. టెర్రకోట కళాకారులు ఎమ్మెల్యేకు మట్టి వినాయక ప్రతిమలను అందజేశారు. కార్యక్రమాల్లో కూటమి నాయకులు ఆర్‌వీ బాలాజీ, రాజన్న, సుబ్రహ్మణ్యం గౌడు, కుట్టీ, గిరిబాబు, శ్రీధర్, ఖాజా, నాగరాజు, చాంద్ భాషా, మదన్, చెంగప్ప, కృష్ణమూర్తి గౌడు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!