
ఎస్ఆర్ పురం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,సెప్టెంబరు 08:
గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున డాక్టర్ హరికృష్ణ ఎమ్మెల్యేగా ఎన్నిక కావాలని కోరుతూ ఎస్ఆర్ పురం మండలం కటికపల్లి మాజీ సర్పంచ్ మార్కొండయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని మార్కొండయ్య దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకం నిర్వహించి, ప్రత్యేక పూజలు చేశారు. డాక్టర్ హరికృష్ణ గంగాధర నెల్లూరు నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని స్వామివారిని ప్రార్థించి నట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి,ప్రజా సంక్షేమం కోసం డాక్టర్ హరికృష్ణకు భవిష్యత్తులో రాజకీయంగా మంచి అవకాశాలు లభించాలని ఆకాంక్షిస్తూ ఈ పూజలు నిర్వహించి నట్లు మార్కొండయ్య పేర్కొన్నారు.


Recent Comments