EPAPER
Sunday, October 18, 2026
Google search engine

ప్రతి గురువు విద్యార్థికి క్రమశిక్షణతో కూడిన విద్యను అందించాలి.. ఎమ్మెల్యే డాక్టర్ థామస్

📰 Generate e-Paper Clip

ఎస్ఆర్ పురం, చిత్తూరు ఎక్స్ ప్రెస్, సెప్టెంబర్ 05:

 

ప్రతి గురువు విద్యార్థికి క్రమశిక్షణతో కూడిన విద్యను అందించాలి అని ప్రభుత్వ విప్ ఎంఎల్ఏ డాక్టర్ థామస్ అన్నారు శనివారం కార్వేటినగరం మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తికే వన్నెతెచ్చిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి రోజు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం ఎంతో గర్వించదగ్గ విషయమని తెలిపారు… ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థులను క్రమశిక్షణతో విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత స్థితికి ఎదిగేలా కృషి చేయాలని అప్పుడే ఆ గురువుకి విలువ ఉంటుందని తెలిపారు.. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఘనంగా సన్మానించి సత్కరించారు అనంతరం ఎమ్మెల్యే సోదరుడు ఆదాం సుందర్రాజన్ మాదిరాజు గణేష్ రాజు కుమార్ రాజు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ కు ఘనంగా పూల వర్షంతో ఘనస్వాగతం పలికారు.. అనంతరం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఎమ్మెల్యే సోదరుడు ఆదాం సుందర్ రాజన్ మాదిరాజు గణేష్ రాజు కుమార్ రాజు లను ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఘనంగా సన్మానించి సత్కరించారు.. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు షణ్ముగం రెడ్డి ప్రధాన కార్యదర్శి సునీల్ చౌదరి.. పాలసముద్రం మండల మాజీ ఎంపీపీ ఇందిరమ్మ,సహకార సంఘ డైరెక్టర్ చంగల్రాయులు, మాదిరాజు మురళి కృష్ణరాజు, తయ్యూరు సురేష్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!