శ్రీకాళహస్తి, సెప్టెంబర్ 2 (చిత్తూరు ఎక్స్ప్రెస్) శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం కొండ్రాజుపల్లి గ్రామానికి చెందిన సండ్ర మస్తాన్ నాయుడు ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన కర్మక్రియల సందర్భంగా మంగళవారం నిర్వహించిన కార్యక్రమానికి కలవకుంట భరత రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సండ్ర మస్తాన్ నాయుడు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి, ధైర్యంగా ఉండాలని సూచిస్తూ తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మస్తాన్ నాయుడు కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామ పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు.



Recent Comments