EPAPER
Friday, September 4, 2026
Google search engine

25 ఏళ్ల జర్నలిజం సేవలకు గౌరవం..  సయ్యద్ అక్రమ్ కు డాక్టరేట్

📰 Generate e-Paper Clip

కప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఆగస్టు 29:

 

చిత్తూరు జిల్లా వి.కోట,కుప్పం ప్రాంతాల్లో గత 25 ఏళ్లుగా వివిధ పత్రికలు, టీవీ ఛానళ్లలో పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న జర్నలిస్ట్ సయ్యద్ అక్రమ్ కు గౌరవ డాక్టరేట్ లభించింది. యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ ఫర్ లీడర్‌షిప్ అండ్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అక్రమ్ కు గౌరవ డాక్టరేట్‌ ను ప్రదానం చేశారు. పాండిచ్చేరిలో నిర్వహించిన సోషల్ లీడర్స్ అండ్ విజనరీస్ కాన్‌క్లేవ్–2026 కార్యక్రమం లో ఈ పురస్కారాన్ని అందజేశారు. గత 25 ఏళ్లుగా జర్నలిజం రంగంలో కొనసాగుతూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు వాటి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తున్న అక్రమ్ సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. గౌరవ డాక్టరేట్ అందుకున్న జర్నలిస్ట్ సయ్యద్ అక్రమ్ ను పలువురు జర్నలిస్టులు, ప్రజా ప్రతినిధులు, మిత్రులు అభినందించారు. ఆయన భవిష్యత్తులోనూ ప్రజా సమస్యలపై మరింతగా పనిచేయాలని ఆకాంక్షించారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!