
హైదరాబాద్,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఆగస్టు15:
మియాపూర్–అమీన్పూర్ పరిధిలోని శిల్పా కాలనీలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను కాలనీ వాసులు ఘనంగా నిర్వహించారు. శిల్పా కాలనీ పార్కులో జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, దేశభక్తి భావాలను చాటుకున్నారు. ఈ సందర్భంగా కాలనీ పెద్దలు స్వాతంత్ర్య దినోత్సవ ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రసంగించగా, యువత, మహిళలు, చిన్నారులు దేశభక్తి గీతాలతో ఆకట్టుకున్నారు. అనంతరం దేశభక్తి, సోదరభావం, ఐకమత్యం ప్రాధాన్యతను రాబోయే తరాలకు తెలియజేసే ఉద్దేశంతో “శిల్పా తిరంగా బైక్ ర్యాలీ” నిర్వహించారు. కాలనీ పెద్దలు, యువత, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం కాలనీలో దేశభక్తి, ఐక్యతా భావాన్ని చాటుతూ ఉత్సాహభరితంగా సాగింది.


Recent Comments