EPAPER
Sunday, October 18, 2026
Google search engine

అంగన్‌వాడీలకు జ్ఞానజ్యోతి శిక్షణ

📰 Generate e-Paper Clip

పలమనేరు,చిత్తూరు ఎక్స్‌ప్రెస్, ఆగస్టు11:

 

చిత్తూరు జిల్లాపలమనేరు మండలంలోని జడ్పీహెచ్‌ఎస్‌ బాలుర ఉన్నత పాఠశాలలో అంగన్‌వాడీ కార్యకర్తలకు జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. ఐసీడీఎస్‌ సీడీపీఓ ఉమారాణి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాన్ని ఎంఈఓ-1 లీలారాణి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా 0–3, 3–6 సంవత్సరాల పిల్లల సమగ్ర, మెదడు అభివృద్ధి, ఎఫ్‌ఎల్‌ఎన్‌, మదర్‌ ఐడియా కార్డులు, ఇంగ్లిష్‌ పరిచయం, ప్రీస్కూల్‌ నమోదు శాతం పెంపు తదితర అంశాలపై కార్యకర్తలకు అవగాహన కల్పించారు. నవచేతన, ఆధార్‌శీలా ప్రాముఖ్యతను వివరించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను అంగన్‌వాడీ కేంద్రాల్లో సమర్థంగా అమలు చేయాలని సీడీపీఓ సూచించారు. ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు శిక్షణ కొనసాగుతుందని ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ నజ్మా తెలిపారు. డీఆర్‌పీలు నాగరాజు, చందు, యతీష్‌, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!