EPAPER
Sunday, October 18, 2026
Google search engine

కడ అభివృద్ధి పనులను పరిశీలించిన ప్రత్యేక అధికారి

📰 Generate e-Paper Clip

శాంతిపురం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్,ఆగస్టు11:

 

కడ ప్రత్యేక అధికారి వికాస్ మర్మత్ మంగళవారం రాళ్లబూదుగూరులో పర్యటించి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. రాళ్లబూదుగూరు సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థినులకు అందుతున్న భోజనం, వసతి, ఇతర సౌకర్యాలపై ఆరా తీశారు. లోపాలను వెంటనే సరిచేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన పార్కును పరిశీలించి, దాని నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఎన్.ఉదయ్‌కుమార్, యూనిట్ ఇన్‌చార్జ్ ఆర్‌ఎస్.మణి, క్లస్టర్ ఇన్‌చార్జిలు రాజేంద్ర, నాగరాజు, రెస్కో డైరెక్టర్ బసవరాజు, నాయకులు మంజునాథ్, జెనీ, శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!