EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

పరిగిలో వైసీపీ రిలే నిరాహార దీక్ష

📰 Generate e-Paper Clip

హిందూపురం,పరిగి,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఆగస్టు06:

 

శ్రీసత్యసాయి జిల్లా పరిగి మండల కేంద్రంలోని పోస్టాఫీస్ సమీపంలో గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. పెనుగొండ నియోజ కవర్గ సమన్వయకర్త, జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ దీక్షలో వైసీపీ మండల శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ మెగా డీఎస్సీ నియామకాల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీచేపట్టిన ఆందోళనలో భాగంగానే ఈ రిలేనిరాహార దీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించి న్యాయం చేయాల ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు,ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!