EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

ప్రతి కుటుంబంలో ఓ పారిశ్రామికవేత్త తయారవ్వాలి

📰 Generate e-Paper Clip

హిందూపురం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఆగస్టు 06:

 

హిందూపురం పురపాలక సంఘంలో గురువారం తెలుగుతల్లి, భారతమాత పట్టణ సమాఖ్యల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యం రిజిస్ట్రేషన్ వర్క్‌షాప్లో ప్రతి కుటుంబంలో కనీసం ఒక పారిశ్రామికవేత్త తయారవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని అధికారులు తెలిపారు. మెప్మా డీఎంసీ ఎల్. గంగులయ్య మాట్లాడుతూ ఉద్యం రిజిస్ట్రేషన్ ప్రాముఖ్యతను వివరించి, స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే జిల్లా పరిశ్రమల శాఖ అధికారులు పీఎంఎఫ్‌ఎంఈ, పీఎంఈజీపీ పథకాల ద్వారా 35 శాతం సబ్సిడీతో రుణాలు పొందుతూ చిన్న, మధ్య తరహా పరిశ్రమలు స్థాపించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ ఐపీఓ ఓబులేసు, జే.పీ. దుర్గేష్, మెప్మా సిబ్బంది, కమ్యూనిటీ ఆర్గనైజర్లు, పట్టణ సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!