EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

మహిళల సాధికారతే రాష్ట్రాభివృద్ధికి పునాది:  ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి

📰 Generate e-Paper Clip

పలమనేరు, చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఆగస్టు 06:

 

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా స్వావలంబన సాధించి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి అన్నారు. గురువారం పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన 159 మంది డ్వాక్రా మహిళలకు ఈ-సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళల సంక్షేమం, సాధికారతకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఈ-సైకిళ్ల వినియోగంతో ఇంధన వ్యయం తగ్గడంతో పాటు ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, ఆర్.వి. బాలాజీ, జనసేన, టీడీపీ నాయకులు, మెప్మా అధికారులు, డ్వాక్రా సంఘాల సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!