EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

యూరియా కొరత నివారణకు చర్యలు తీసుకోవాలి:  తలపా దామోదరం రెడ్డి

📰 Generate e-Paper Clip

శ్రీకాళహస్తి,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఆగస్టు 06:

 

ఖరీఫ్ సీజన్‌లో రైతులు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున వెంటనే తగిన చర్యలు చేపట్టి సకాలంలో యూరియా అందుబాటులోకి తీసుకురావాలని శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి కోరారు.ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు గురువారం శ్రీకాళహస్తి వ్యవసాయ సహాయ సంచాలకులు రమేష్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ రైతులకు యూరియా కార్డులు సకాలంలో అందజేసి,ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు పంపిణీ చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించి, పంట నష్టాలను నివారించేందుకు అవసరమైన సూచనలు, సలహాలు అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కరీముల్లా, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం, శ్రీకాళహస్తి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సురేంద్ర రెడ్డి, నాగరాజు, షాన్ మైఖేల్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!