EPAPER
Sunday, October 18, 2026
Google search engine

విజ్ఞానగిరి పై ఆడి కృతిక సందర్భంగా భక్తులకు చల్లటి మజ్జిగ పంపిణీ

📰 Generate e-Paper Clip

శ్రీకాళహస్తి,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఆగస్టు 06:

 

శ్రీకాళహస్తి: విజ్ఞానగిరిపై వెలసిన కుమారస్వామి స్వామివారి ఆడి కృతిక మహోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి కాసరం రమేష్ , వారి మిత్రబృందం ఆధ్వర్యంలో భక్తులకు చల్లటి మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ , శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై వారి చేతుల మీదుగా భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి ఏడాది ఆడి కృతిక మహోత్సవం సందర్భంగా సేవే మార్గం – సేవే లక్ష్యం అనే నినాదంతో యువత ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఇటువంటి కార్యక్రమాల్లో తమను భాగస్వాములను చేయడం ఆనందంగా ఉందని, భక్తి భావంతో యువత సేవా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా మన సంస్కృతి, సాంప్రదాయాలు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. అలాగే గత సంవత్సరాలతో పోలిస్తే ఈసారి అధికారులు, పోలీసులు సమన్వయంతో మెరుగైన ఏర్పాట్లు చేశారని, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు ఏర్పాటు చేసి, దర్శనం కోసం ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా అన్ని చర్యలు తీసుకున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు రేణుకా దేవి,శ్రీకాళహస్తీశ్వర స్వామి ధర్మకర్తల మండలి సభ్యులు వాకచర్ల గుర్రప్ప శెట్టి, కుమారస్వామి ధర్మకర్తల మండలి సభ్యులు బాలు ఢిల్లీ బాబు, కంటా సుబ్బు, కోరా రాకేష్, బాబు నాయుడు, నాగరాజు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!