
శ్రీకాళహస్తి, చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఆగస్టు 06:
శ్రీకాళహస్తి నియోజకవర్గం, తొట్టంబేడు మండలం ఇలగనూరు సచివాలయంలో రైతులకు 50 శాతం సబ్సిడీతో జీలగలు, పిల్లి పెసర్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు, కూటమి ప్రభుత్వ నిర్ణయాలు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సూచనల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో రైతులకు విత్తనాలను అందజేశారు.ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గాలి మురళి నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సంక్షేమ, వ్యవసాయ పథకాలను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అన్ని సచివాలయాల్లో ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ విత్తనాల పంపిణీ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ వ్యవసాయ అధికారులు పవన్, పవిత్ర, ఈ. నయతుల్లా, మాజీ సర్పంచ్ మధు నాయుడు, మహిళా నాయకురాలు గీత, ఇంజినీరింగ్ అసిస్టెంట్ వెంకయ్యతో పాటు పలువురు నాయకులు, రైతులు పాల్గొన్నారు.


Recent Comments