EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

ఆటో డ్రైవర్ నిజాయితీ..  పోగొట్టుకున్న ఫోన్‌ను యజమానులకు అందజేసిన ట్రాఫిక్ పోలీసులు

📰 Generate e-Paper Clip

శ్రీకాళహస్తి,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఆగస్టు 06:

 

శ్రీకాళహస్తి బిక్షాల గాలిగోపురం వద్ద పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను పట్టణ ట్రాఫిక్ పోలీసులు గుర్తించి సంబంధిత యజమానులకు సురక్షితంగా అప్పగించారు. శ్రీకాళహస్తీశ్వరస్వామి, అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో తమ మొబైల్ ఫోన్‌ను పొరపాటున పోగొట్టుకున్నారు. దీనిని గమనించిన ఆటో డ్రైవర్ తన నిజాయితీనిచాటుతూ మొబైల్ ఫోన్‌ను వెంటనే పట్టణ ట్రాఫిక్ పోలీసులకు అప్పగించాడు. ఫోన్‌లోని వివరాల ఆధారంగా ట్రాఫిక్ పోలీసులు బాధితులను గుర్తించివారిని సంప్రదించా రు. అనంతరం వారి మొబైల్ ఫోన్‌ను భద్రంగా అప్పగించారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసుల సేవాభావాన్ని, ఆటో డ్రైవర్ నిజాయితీని స్థానికులు, భక్తులు ప్రశంసించారు. ప్రజల ఆస్తులను భద్రంగా యజమానులకు చేరవేయడంలో పోలీసుల చొరవ అభినందనీయమని వారు పేర్కొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!