EPAPER
Sunday, October 18, 2026
Google search engine

11వ క్లస్టర్ పరిధిలో టీడీపీ డోర్ టు డోర్ కార్యక్రమం క్లస్టర్ ఇంచార్జ్ కన్నన్

📰 Generate e-Paper Clip

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఆగస్టు06:

 

కుప్పం మున్సిపాలిటీ 11వ క్లస్టర్ పరిధిలోని ఆర్‌కేఎం నగర్‌లో గురువారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ కన్నన్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హులైన లబ్ధిదారునికి చేరేలా పార్టీ శ్రేణులు కృషి చేస్తున్నాయని తెలిపారు. పార్టీని మరింత బలోపేతం చేయడంలో ప్రతి కార్యకర్త చురుకుగా పాల్గొని ప్రజలకు అందుబాటులో ఉండాలని క్లస్టర్ ఇంచార్జ్ కన్నన్ పిలుపునిచ్చారు. ప్రజలతో నిరంతర సంబంధాలను కొనసాగిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనిట్ ఇంచార్జ్ సుభాన్ బాబు, జనరల్ సెక్రటరీ నబి, బూత్ ఇంచార్జ్ ఉమాశంకర్‌తో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!