EPAPER
Sunday, October 18, 2026
Google search engine

జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తాపడ్డ కారు ఇద్దరు మహిళలు మృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు

📰 Generate e-Paper Clip

వి.కోట,చిత్తూరు ఎక్స్‌ప్రెస్, ఆగస్టు 04 :

 

చిత్తూరు జిల్లా వి.కోట మండలం కర్ణాటక సరిహద్దు సమీపంలోని జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరు నుంచి తిరుపతి వైపు వెళ్తున్న కారు రామాపురం సమీపంలోని హంద్రీ–నీవా కాల్వ వద్దకు చేరుకోగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మానస, గౌతమి అనే ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, స్థానికుల సమాచారం మేరకు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న వి.కోట పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వి.కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యుల ప్రాథమిక పరిశీలన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని మెరుగైన వైద్యం కోసం కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై వి.కోట పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!