EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

కొణతనేరిలో నూతన అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

📰 Generate e-Paper Clip

గాలి బ్రదర్స్ కృషితో పూర్తయిన భవనం

తొట్టంబేడు మండలం కొణతనేరి పంచాయతీ గాంధీ సెంటర్ నందు నూతనంగా నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి శుక్రవారం ఘనంగా ప్రారంభించారు.గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఈ భవన నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయిందని,దీంతో చిన్నారులు చెట్ల కింద కూర్చోవాల్సిన దుస్థితి నెలకొందని స్థానికులు తెలిపారు. ఈ విషయాన్ని మాజీ రాష్ట్ర కార్యదర్శి గాలి చలపతి నాయుడు, సీనియర్ నాయకులు గాలి.మురళి నాయుడు గమనించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.వెంటనే స్పందించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మండల గ్రాండ్ నిధుల నుంచి రూ. 5 లక్షలు మంజూరు చేయించి భవన నిర్మాణాన్ని పూర్తి చేయించారు.అంగన్వాడీ చిన్నారులకు ఇక సొంత భవనం ఏర్పడటంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గాంధీ సెంటర్ వాసులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గాంధీ సెంటర్ లో డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేస్తామని, ఇళ్ల మీదుగా వెళ్తున్న విద్యుత్ లైన్ల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే పాడుబడిన ప్రాథమిక పాఠశాలను తొలగించి సుమారు రూ. 25 లక్షల ప్రభుత్వ గ్రాంట్ తో కాంపౌండ్ వాల్ తో సహా నూతన పాఠశాల భవనాన్ని నిర్మిస్తామని,గిరిజనుల కోసం ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తొట్టంబేడు మండల అధ్యక్షుడు రావిళ్ళ మునిరాజ నాయుడు, తిరుపతి పార్లమెంటు అధికార ప్రతినిధి చెన్ను రాఘవులు యాదవ్, ఎంపీడీవో సురేంద్రనాథ్, సీడీపీఓ శాంతి దుర్గ, పంచాయతీరాజ్ శాఖ ఏఈ ప్రీతి, గౌరీ జోష్, తంగేళ్లపాలెం సింగిల్ విండో చైర్మన్ భాస్కర్ ముదిరాజ్, మునిరత్నం, మాజీ జడ్పిటిసి వెంకటాచలం, కొన్నలి రమేష్, ఆయకట్టు అధ్యక్షుడు లెక్కల వెంకటముని నాయుడు, కన్నలి ప్రతాప్ రెడ్డి, వున్నం ప్రసాద్, మాజీ సర్పంచులు గాలి బాలాజీ నాయుడు, కర్ణం హరిబాబు నాయుడు, మాజీ ఎంపీటీసీ భాస్కర్, అంగన్వాడీ టీచర్ అరుణ, గాలి భారతి, కస్తూరయ్య, యువ నాయకుడు నాని, చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రజలు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!