EPAPER
Sunday, October 18, 2026
Google search engine

విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ కార్యక్రమం

📰 Generate e-Paper Clip

శ్రీకాళహస్తి, చిత్తూరు ఎక్స్‌ప్రెస్
శ్రీకాళహస్తిలోని ఓ పాఠశాలలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం 130 మంది విద్యార్థులకు ఉచితంగా నోట్‌బుక్స్, పెన్సిళ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో పూల మొక్కలు,  చెట్లను నాటారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షురాలు మల్లెమాల ప్రమీల మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ, నిజాయితీ, సేవాభావం అలవర్చుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను గౌరవిస్తూ శ్రద్ధగా చదివితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని, సమాజానికి ఆదర్శ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. రోటరీ క్లబ్ సభ్యులు విద్యార్థులకు విద్య ప్రాముఖ్యత, మంచి అలవాట్లపై అవగాహన కల్పించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను కూడా విద్యార్థులు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు మేగీ క్లారా, కండ్రిగ ఉమా, జనార్ధన్, కృష్ణకుమార్, సదాశివన్న, ప్రమీల, తరుణ్, ప్రధానోపాధ్యాయుడు హరినాథ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!