EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

అన్నదమ్ముల మధ్య 20 ఏళ్ల భూ వివాదానికి శాశ్వత పరిష్కారం టీడీపీ నాయకులు, గ్రామ పెద్దల సమక్షంలో రాజీ.. సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు

📰 Generate e-Paper Clip

కుప్పం, చిత్తూరు ఎక్స్‌ప్రెస్, జూలై 28:

 

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం మఠం గ్రామపంచాయతీ పరిధిలోని కేపీ మిట్ట గ్రామంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య దాదాపు రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ వివాదానికి మంగళవారం శాశ్వత పరిష్కారం లభించింది. గ్రామ పెద్దలు, అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకుల సమక్షంలో ఇరు వర్గాల మధ్య చర్చలు జరిపి పరస్పర అంగీకారంతో వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించారు. దీంతో రెండు కుటుంబాల మధ్య నెలకొన్న విభేదాలకు తెరపడింది. ఈ పరిష్కార కార్యక్రమంలో టీడీపీ క్లస్టర్ ఇన్‌చార్జి రాజేంద్రప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి మంజునాథ్,యూనిట్ ఇన్‌చార్జి మునిరెడ్డి, గ్రామపంచాయతీ అధ్యక్షుడు జైపాల్, యారాబ్, భాస్కర్, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.., ప్రజల సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ వివాదానికి శాశ్వత పరిష్కారం లభించడం సంతోషకరమని తెలిపారు. ఈ అవకాశాన్ని కల్పించి ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే గ్రామంలో శాంతి, సామరస్యం నెలకొనేలా సహకరించిన గ్రామ పెద్దలు, అధికారులు, ప్రజలకు అభినందనలు తెలియజేశారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!