శ్రీకాళహస్తి, చిత్తూరు ఎక్స్ప్రెస్
శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సందర్శించి విద్యార్థినులతో స్వయంగా మాట్లాడారు.కూటమి ప్రభుత్వం తరఫున విద్యార్థినులకు ఉచితంగా బ్లాంకెట్లు ,దుప్పట్లు, షూస్ పంపిణీ చేశామని ఈ సందర్భంగా శాసనసభ్యులు తెలిపారు.అనంతరం వసతి గృహంలో అందుతున్న సౌకర్యాలు,భోజన నాణ్యతపై విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు.హాస్టల్‌లో ఫ్యాన్లు, బ్లాక్ బోర్డుల కొరత ఉందని విద్యార్థినులు తెలపడంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే, అప్పటికప్పుడే ఫ్యాన్లు, బ్లాక్ బోర్డును అందజేసి తన ఔదార్యాన్ని చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో యువ నాయకులు ఖాదర్ ప్రసాద్ పాల్గొన్నారు. విద్యార్థినులకు ఫ్యాన్లను అందజేసే కార్యక్రమంలో ఆయన పాల్గొని సహకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మన వసతి గృహాల్లో ఉండే పేద విద్యార్థినులకు ఎలాంటి లోటు లేకుండా,వారి చదువుకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమే మన ప్రాధాన్యత అని అన్నారు.ఈ కార్యక్రమంలో వసతి గృహ వార్డెన్, ఖాదర్, ప్రసాద్ తదితర నాయకులు పాల్గొన్నారు.



Recent Comments