EPAPER
Sunday, October 18, 2026
Google search engine

జాతీయ స్థాయి కరాటే పోటీలకు ఎంపికైన ఊర్విశర్మ ను  ఘనంగా సన్మానించిన టిడిపి నాయకులు  

📰 Generate e-Paper Clip

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూలై 23:

 

చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ 19వ వార్డుకు చెందిన చిన్నారి ఊర్వి శర్మ ఇటీవల తిరుపతిలో నిర్వహించిన 6వ ఏపీ స్టేట్ కరాటే ఛాంపియన్‌షిప్లో ప్రతిభ కనబర్చి విజేతగా నిలిచి, మైసూరులో జరగనున్న 29వ ఆల్ ఇండియా కరాటే ఛాంపియన్‌షిప్ జాతీయ స్థాయి ఎంపికలకు అర్హత సాధించిన సందర్భంగా స్థానిక కౌన్సిలర్ జిమ్ దాము గురువారం ఆమె నివాసానికి వెళ్లి అభినందించారు. ఈ సందర్భంగా ఊర్వి శర్మకు శాలువా కప్పి, జ్ఞాపిక అందజేసి సన్మానించారు. జాతీయ స్థాయిలో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబర్చి కుప్పం పట్టణానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాడా మెంబర్ సుగుణమ్మ, తెలుగుదేశం పార్టీ నాయకులు శారదమ్మ, రాధా, శశి, నవనీత, లోకేష్, మల్లాద్రి నాయుడు తదితరులు పాల్గొని ఊర్వి శర్మకు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!