శ్రీకాళహస్తి, చిత్తూరు ఎక్స్ప్రెస్, జూలై 17
శ్రీకాళహస్త శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానమునకు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్థన్ శుక్రవారం కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వరాలయానికి విచ్చేశారు. వీరికి దేవస్థానం అధికారులు వారిని సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేసి దక్షిణామూర్తి సన్నిధి వద్ద వారికి వేదపండితులచే ఆశీర్వదించి శేష వస్త్రాలతో సత్కరించి స్వామి అమ్మవార్ల తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఏఈఓ లోకేష్ బాబు, ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, సూపరింటెండెంట్ నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ ఏం హరి యాదవ్ , ఏపీఆర్వో రవి తదితరులు పాల్గొన్నారు.



Recent Comments