EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

రేణిగుంట విమానాశ్రయంలో నారా భువనేశ్వరికి ఘన స్వాగతం పలికిన  ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి 

📰 Generate e-Paper Clip

రేణిగుంట,చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూలై 15:

 

రేణిగుంట విమానాశ్రయానికి విచ్చేసిన శ్రీమతి నారా భువనేశ్వరి గారికి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్ఛం అందించి ఆత్మీయంగా ఆహ్వానించారు. అనంతరం నియోజకవర్గ పరిధిలోని అత్యంత పురాతన, చారిత్రక ప్రాధాన్యం కలిగిన శైవ క్షేత్రమైన గుడిమల్లం శ్రీ పరశురామేశ్వర స్వామి దేవాలయం విశిష్టతను వివరిస్తూ రూపొందించిన కాఫీ టేబుల్ బుక్‌ను నారా భువనేశ్వరి గారికి బహూకరించారు.ఈ సందర్భంగా గుడిమల్లం ఆలయ చారిత్రక, ఆధ్యాత్మిక విశిష్టతను ఆమెకు వివరించారు. నియోజకవర్గంలోని వారసత్వ సంపదను రాష్ట్ర స్థాయిలో మరింతగా పరిచయం చేసే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని అందజేసినట్లు నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన పలువురు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!