
సిద్ధవటం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూలై 15:
సిద్ధవటం మండలంలోని వంతాటిపల్లె గ్రామ పరిధిలో లంకమల అభయారణ్యంలో వెలసిన శ్రీ నిత్యపూజేశ్వర కోన (పంచలింగాల గుడి) పరిసరాల్లో బుధవారం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం చేపట్టారు. ఇన్‌చార్జి ఎండోమెంట్స్ ఈవో సురేష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ పరిసరాల్లో పేరుకుపోయిన అపరిశుభ్రతను తొలగించి, పరిశుభ్ర వాతావరణం కోసం బ్లీచింగ్ పౌడర్ పిచికారీ నిర్వహించారు. భక్తులకు స్వచ్ఛమైన వాతావరణం కల్పించడంతో పాటు, లంకమల అభయారణ్యంలో వన్యప్రాణుల సంరక్షణ దృష్ట్యా కూడా ఈ పారిశుధ్య చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్స్ శాఖ సిబ్బంది చంద్రతో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


Recent Comments