
కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూలై 14:
ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు, పెండింగ్ డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు మంగళవారం ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్, కుప్పం నియోజకవర్గ ఇన్చార్జి పి.ఎస్. మునిరత్నంను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలను మునిరత్నం దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని కోరారు. వినతిపత్రాన్ని స్వీకరించిన పి.ఎస్. మునిరత్నం మాట్లాడుతూ, జేఏసీ ప్రతినిధులు ప్రస్తావించిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారం కోసం తనవంతు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా జేఏసీ కన్వీనర్లు ఉపేంద్ర, బలరామమూర్తి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.ఎస్. బాబు, శ్రీకర్ రెడ్డి,కుప్పం డిపో జేఏసీ అధ్యక్షుడు జి.మున్నెప్ప, కార్యదర్శి జయపాల్,నాయకులు ఎం.కరుణాకరన్,ఎ.వేలూ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జేఏసీ చేపడుతున్న కార్యక్రమాలకు ఉద్యోగులందరూ ఐక్యంగా మద్దతు ఇవ్వాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు.


Recent Comments