EPAPER
Thursday, August 20, 2026
Google search engine

అనారోగ్యంతో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన రెడ్యం దంపతులు

📰 Generate e-Paper Clip

ఖాజీపేట, చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూలై 14:

 

ఖాజీపేట మండలం దుంపలగట్టుకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు తవ్వా సుబ్బారెడ్డి, అలాగే ఖాజీపేట మండల యువజన విభాగం అధ్యక్షుడు ముత్తూరు రమణ పెద్దమ్మ శ్రీమతి ముచ్చుగుంట్ల సుబ్బమ్మ అనారోగ్యంతో చికిత్స పొందుతుండగా, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, ఆయన సతీమణి శ్రీమతి రెడ్యం లక్ష్మీ ప్రసన్న సోమవారం రాత్రి ఆసుపత్రులకు వెళ్లి పరామర్శించారు. తవ్వా సుబ్బారెడ్డి కడప నగరంలోని శృతి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, శ్రీమతి ముచ్చుగుంట్ల సుబ్బమ్మ శీలం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిద్దరి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న రెడ్యం దంపతులు, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా సంబంధిత వైద్యులు డాక్టర్ మురళీ మాధవ్, డాక్టర్ శీలం సుబ్బారాయుడుతో మాట్లాడిన రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, వారికి మెరుగైన వైద్య సేవలు అందించి త్వరగా కోలుకునేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ పరామర్శ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు రెడ్యం నాగేశ్వర్‌రెడ్డి, ముత్తూరు రమణ, రెడ్యం శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!