
రేణిగుంట,చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూలై 13 :
హిందూ సాంప్రదాయంలో గోమాతకు ప్రత్యేక స్థానం ఉంది.ఆవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని నమ్ముతారు.సరిగ్గా ఇదే నమ్మకంతో రేణిగుంట మండలం కుర్రకాలువ గ్రామానికి చెందిన బిజెపి ఓ బి సి మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు వేణు ముదిరాజ్,జి పాల్యం మాజీ సర్పంచ్ కుర్రకాలువ రాణేమ్మ వారి కుటుంబ సభ్యులు వారి ఇంటిలోని గోమాత పై ఉన్న ప్రేమాభిమానాలను చాటుకున్నారు.గర్భంతో ఉన్న ఆవుకు సోమవారం సాయంత్రం శుభ సమయంలో ఇంటి ఆడపడుచుకు ఎలా శ్రీమంతం చేస్తారో సరిగ్గా అలాగే ఈ మూగజీవానికి గ్రామంలోని ముత్తైదువుల చేతుల మీదుగా శ్రీమంతం వేడుక ను వైభవంగా నిర్వహించారు.ఈ వేడుకలో భాగంగా గోమాతకు పసుపు కుంకుమ పెట్టి పూలమాలలతో ముస్తాబు చేశారు. శ్రీమంతం భోజనంగా ఆవుకు ఇష్టమైన తినుబండారాలు,పండ్లూ, ప్రత్యేక గ్రాశాన్ని తినిపించారు.


Recent Comments