శ్రీకాళహస్తి,చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూలై 05:
శ్రీకాళహస్తి విజయవాడ వాస్తవ్యులు అమరేశ్వర రావు అనే భక్తుడు కుటుంబ సభ్యులతో కలసి ఆదివారం శ్రీజ్ఞాన ప్రసూనాంబికా దేవి అమ్మవారికి సుమారు ఆరులక్షల ఐదువేలరూపాయ లు విలువ చేసే బంగారు ఆభరణాన్ని విరాళంగా ఆలయ కార్య నిర్వహణాధి కారి బి.కె.వెంకటేశులు అందజేసినారు. ఆలయ అధి కారులు,వేదపండితులు ఈ విరాళం స్వీకరించారు. దాతకు కృతజ్ఞతలు తెలియచేసి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం గురు దక్షిణామూర్తి సన్నిధిలో ఆలయ పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. అదేవిధంగా స్వామి అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఏ.ఈ.ఓ విద్యాసాగర్ రెడ్డి, అకౌంటెంట్ శ్రీ యుగంధర్, ఏ.పి.ఆర్.ఓ శ్రీ కె. శ్రీనివాసులు, మహేష్, అప్రైజర్ బాలాజి పాల్గొన్నారు.


Recent Comments