EPAPER
Thursday, August 20, 2026
Google search engine

ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ కార్యక్రమం కడ పిడి వికాస్ మర్మత్ 

📰 Generate e-Paper Clip

కుప్పం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్,జూన్ 21:

 

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం సోమవారం కుప్పం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. కాడా ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలను నేరుగా సమర్పించవచ్చని అధికారులు వెల్లడించారు. ప్రజల నుంచి అందిన అర్జీలను స్వీకరించి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసి పరిష్కార చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వేగవంతమైన పరిష్కారం అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. భూ సమస్యలు, తాగునీటి సౌకర్యం, రహదారులు, సంక్షేమ పథకాల అమలు, రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యుత్, ఇతర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమస్యలను ప్రజలు ఈ వేదిక ద్వారా నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. కుప్పం పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను వినతిపత్రాల రూపంలో సమర్పించి పరిష్కారం పొందాలని అధికారులు కోరారు. ప్రజల సమస్యలను ఆలస్యం లేకుండా పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని వెల్లడించారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!